తెలంగాణ

telangana

ETV Bharat / crime

drugs: హైదరాబాద్‌లో 3 కిలోల డ్రగ్స్‌ పట్టుకున్న ఎన్‌సీబీ.. నిందితుడు అరెస్ట్​ - telangana varthalu

drugs: హైదరాబాద్‌లో 3 కిలోల డ్రగ్స్‌ పట్టుకున్న ఎన్‌సీబీ
drugs: హైదరాబాద్‌లో 3 కిలోల డ్రగ్స్‌ పట్టుకున్న ఎన్‌సీబీ

By

Published : Oct 23, 2021, 3:27 PM IST

Updated : Oct 23, 2021, 5:07 PM IST

15:25 October 23

హైదరాబాద్‌లో 3 కిలోల డ్రగ్స్‌ పట్టుకున్న ఎన్‌సీబీ

   హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ కొరియర్ కార్యాలయంలో ఎన్సీబీ అధికారులు 3కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు చేసిన పార్శిల్​ను పక్కా సమాచారం మేరకు ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పార్సిల్​ను విప్పి చూడగా.. చీరల లోపల మాదక ద్రవ్యాల పాకెట్లను ఉంచారు. ఎవరికీ అనుమానం రాకుండా చీరల ఫాల్స్​ను కుట్టేశారు. కొరియర్ చేసిన వ్యక్తి వివరాలను పరిశీలించగా... చెన్నైకు చెందిన వ్యక్తిగా ఎన్సీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. కొరియర్ కార్యాలయంలో సమర్పించిన వివరాల ఆధారంగా ఎన్సీబీ అధికారులు చెన్నె వెళ్లారు. అక్కడి చిరునామాకు వెళ్లి ఆరా తీయగా... నకిలీ గుర్తింపు కార్డులు ఇచ్చినట్లు గుర్తించారు. సాంకేతికతను ఉపయోగించుకొని ఎన్సీబీ అధికారులు కొరియర్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.

మరో ముఠా అరెస్ట్​

   బెంగళూర్ నుంచి హైదరాబాద్​కు డ్రగ్స్ తీసుకొస్తున్న మరో ముఠాను ఎన్సీబీ అధికారులు దేవనహల్లి టోల్ గేట్ వద్ద అరెస్ట్ చేశారు. కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన బెంగళూర్​ ఎన్సీబీ అధికారులు... అతను ఇచ్చిన సమాచారం మేరకు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు బెంగళూర్ నుంచి మాదకద్రవ్యాలు తీసుకెళ్లి.. హైదరాబాద్​లోని పబ్బుల్లో విక్రయిస్తున్నట్లు ఎన్సీబీ దర్యాప్తులో తేలింది. నిందితుల్లో హైదరాబాద్​కు చెందిన యువకుడితో పాటు ఏపీ, బిహార్​కు చెందిన ముగ్గురు వ్యక్తులున్నారు. 

ఇదీ చదవండి: Drugs Seized in Medchal : రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. నిందితుల ఇళ్లలో సోదాలు

Last Updated : Oct 23, 2021, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details