Attack on Excise Department officials: ఎక్సైజ్ అధికారులపై నాటు సారా వ్యాపారుల దాడికి దిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ఏరియాలో చోటుచేసుకుంది. చర్ల మండలంలోని దానవాయిపేట గ్రామంలో విచ్చలవిడిగా నాటుసారా తయారీ, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనే సమాచారం మేరకు నాటుసారా విక్రయ కేంద్రాల పై ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆబ్కారి సిబ్బందిపై గ్రామస్థులు దాడికి దిగారు.
ఎక్సైజ్‌శాఖ అధికారులపై నాటుసారా వ్యాపారులు ఫైర్.. ఆపై కర్రలతో దాడి - Attack on Excise Department officials
Attack on Excise Department officials: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దానవాయిపేటలో నాటు సారా వ్యాపారులు ఆబ్కారీ శాఖ అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఆ గ్రామంలో విచ్చలవిడిగా నాటుసారా తయారీ, అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో.. విక్రయ కేంద్రాలపై ఆబ్కారీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో నాటుసారా వ్యాపారులు వారిపై గొడవకు దిగి కర్రలతో కొట్టారు.
excise department
నాటు సారా స్థావరానికి వెళ్లిన అధికారులు, సిబ్బందిని కర్రలతో కొట్టారు. బూతులు తిడుతూ తనిఖీలకు రావద్దని గ్రామం నుంచి వెళ్లిపోవాలని గొడవ చేశారు. కర్రలతో తీవ్రంగా కొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. జరిగిన సంఘటనపై చర్ల పోలీసు స్టేషన్లో ఆబ్కారీ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి: