2019 ఛత్తీస్‌గఢ్ బస్తర్ ఎన్కౌంటర్ కేసులో తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) సోదాలు(NIA raids in Telugu states) ముగిశాయి. మావోయిస్టులతో సంబంధాల వ్యవహారంలో ఎన్ఐఏ పలువురు అనుమానితుల ఇళ్లలో సోదాలు చేపట్టింది. తెల్లవారుజామున 5 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని 7 జిల్లాల్లో 14 చోట్ల సోదాలు జరిగాయి.
రాష్ట్రంలోని హైదరాబాద్, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు, ఏపీలోని ప్రకాశం, విశాఖ, కృష్ణా జిల్లాల్లో అధికారుల బృందం సోదాలు(NIA raids in Telugu states) నిర్వహించింది. 2019లో మవోయిస్టులకు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, సీఆర్‌పీఎఫ్ జావాన్లకు మధ్య ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు సహా ఒక స్థానికుడు మృతి చెందారు. ఈ ఘటనపై ఛత్తీసగఢ్ నాగర్నగర్లో కేసు నమోదు అయింది. ఈ ఏడాది మార్చి 18న కేసును రీ రిజిస్టర్ చేసిన ఎన్‌ఐఏ(NIA raids in Telugu states).. సుమారు 40మంది అనుమానితులపై కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నేడు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది.
ఆర్కే పుస్తకంపైనా ఆరా
హైదరాబాద్ నాగోల్‌లోని రవిశర్మ, అనురాధ ఇళ్లతో పాటు.. అల్వాల్ సుభాష్ నగర్లో నివసించే బంధు మిత్రుల సంఘం నాయకురాలు భవానీ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు(NIA raids in Telugu states) సోదాలు చేశారు. ఆర్కే జీవితచరిత్రపై పుస్తకం ప్రచురించే విషయంలోనూ ఆమెను ఆరా తీశారు. వనస్థలిపురం పరిధిలోని చింతలకుంట సమీపంలో ఉన్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టిపిఎఫ్) అధ్యక్షుడు కె.రవి చందర్ ఇంటిని ఉదయం నుండి పొలీసులు చుట్టుముట్టారు. అతను ఇంట్లో లేకపోవడంతో ఇంటి తలుపులు పగులగొట్టి సోదాలు నిర్వహించారు.