తెలంగాణ

telangana

ETV Bharat / crime

హనుమకొండలో నర్సింగ్​ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం - student suicide attempt

Student Suicide Attempt: హనుమకొండలో నర్సింగ్​ విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తల్లికి ఫోన్​ చేసి తాను చనిపోతున్నానంటూ చెప్పి మరీ ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Student Suicide Attempt: హనుమకొండలో నర్సింగ్​ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
Student Suicide Attempt: హనుమకొండలో నర్సింగ్​ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

By

Published : Jan 8, 2022, 6:57 PM IST

Student Suicide Attempt: హనుమకొండ జిల్లా కేంద్రంలోని రోహిణి ఆసుపత్రి వసతి గృహంలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎల్కతుర్తి మండలం గోపాల్​పూర్ గ్రామానికి చెందిన రవళి.. రోహిణి నర్సింగ్​ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్​ మూడో సంవత్సరం చదువుతూ కాలేజీ హాస్టల్​లో ఉంటోంది. శుక్రవారం రాత్రి తాను చనిపోతున్నానని తల్లికి ఫోన్​ చేసి చెప్పింది. వెంటనే ఫ్యాన్​కు ఉరివేసుకోగా.. కంగారుపడిన తల్లి హాస్టల్​ నిర్వాహకులను అప్రమత్తం చేయడంతో రవళిని వారు రోహిణి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఆత్మహత్యకు కారణాలేంటి..?

రవళి ఆత్మహత్యాయత్నంతో కళాశాలలో కలకలం రేగింది. విద్యార్థి కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె ఉరేసుకుని ఆత్యహత్యకు యత్నించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. విద్యార్థినీ ఆరోగ్య విషయంలో వైద్యులు ఏ మాత్రం సరిగ్గా స్పందించడం లేదని కుటుంబసభ్యులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details