తెలంగాణ

telangana

ETV Bharat / crime

Drugs seized: పాతబస్తీలో నార్కోటిక్ కంట్రోల్​ బ్యూరో తనిఖీలు.. కిలో డ్రగ్స్​ సీజ్​ - hyderabad crimenews

పాతబస్తీలోని ఓ కొరియర్​ కార్యాలయంలో నార్కోటిక్ కంట్రోల్​ బ్యూరో అధికారులు కిలో డ్రగ్స్​ను సీజ్​ చేశారు. తమిళనాడుకు చెందిన ఇద్దరిని అరెస్ట్​ చేశారు.

Narcotics Control Bureau
Narcotics Control Bureau inspections in old city of hyderabad

By

Published : Aug 4, 2021, 10:11 PM IST

హైదరాబాద్​ పాతబస్తీలోని ఓ కొరియర్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు కిలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు... హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు పార్సిల్ చేసిన కవర్​లో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు పక్కా సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. గుండ్రటి వస్తువుల లోపల మాదక ద్రవ్యాల పొడిని ఉంచినట్లు ఎన్సీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. తాహిర్, మీరన్ అనే ఇద్దరు తమిళనాడు వాసులను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

గత నెల 6వ తేదీన బెంగళూర్​లోనూ ఎన్సీబీ అధికారులు ఓ కొరియర్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి రెండున్నర కిలోల మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. ఈ కేసులో ఆస్ట్రేలియా చిరునామాతో కొరియర్ బుక్ చేసినట్లు గుర్తించారు. అప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్న మరో పార్సిల్​లో 1.4 కిలోల మాదక ద్రవ్యాలున్నట్లు గుర్తించిన ఎన్సీబీ అధికారులు.. ఆస్ట్రేలియా అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫలితంగా ఆ దేశ అధికారులు సదరు మాదక ద్రవ్యాల పార్సిల్​ను సీజ్​ చేశారు.

ఇదీచూడండి:Suicide: 'అవమానమే ఆయువు తీసింది... ఆలస్యంగా వెలుగులోకొచ్చింది'

ABOUT THE AUTHOR

...view details