తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికి కుట్ర .. నిందితుడికి 16 ఏళ్ల జైలు శిక్ష - హైదరాాబాద్‌ తాజా నేర వార్తలు

Nampally court latest news: ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికి కుట్ర పన్నిన కేసులో ఓ నిందితుడికి నాంపల్లి కోర్టు 16 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. శిక్షతో పాటు 26 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

The accused is Abdul Aziz
నిందితుడు అబ్దుల్‌ అజీజ్‌

By

Published : Mar 5, 2022, 3:51 PM IST

Updated : Mar 5, 2022, 4:53 PM IST

Nampally court latest news: ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికి కుట్ర పన్నిన కేసులో నిందితుడు అబ్దుల్‌ అజీజ్‌కు నాంపల్లి కోర్టు 16 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ మెహదీపట్నంకు చెందిన అబ్దుల్‌ అజీజ్‌ 2001లో రెండు వర్గాల మధ్య వైరుధ్యం సృష్టించేందుకు కుట్ర పన్నాడు. అందులో భాగంగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అజీజ్‌ను సిట్‌ పోలీసులు అరెస్టు చేశారు.

అతని వద్ద నుంచి బెల్జియం తుపాకితో పాటు 5 తూటాలు, డిటోనేటర్లు, నకిలీ పాస్‌పోర్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు అబ్దుల్‌ అజీజ్‌కు 16 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు 26 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఇదీ చదవండి:Brother Killed Sister : చెల్లిని చంపిన అన్న.. కారణం తెలిసి పోలీసులు షాక్

Last Updated : Mar 5, 2022, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details