హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ పరిధిలోని శాతంరాయి వద్ద ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
congress leader daughter died: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత కుమార్తె మృతి - congress leader daughter died news
congress leader daughter died: రోడ్డుప్రమాదంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ కుమార్తె మృతి చెందింది. శంషాబాద్‌లో అదుపుతప్పి డివైడర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తానియా(25) మృతి చెందారు. ప్రమాదం సమయంలో కారులో నలుగురు ఉన్నట్లు సమాచారం.
శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత కుమార్తె మృతి
మృతిచెందిన యువతిని టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఫిరోజ్‌ఖాన్ కుమార్తె తానియా(25)గా గుర్తించారు. ఆమె బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నారు. తానియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Aug 1, 2022, 8:41 AM IST