తెలంగాణ

telangana

ETV Bharat / crime

రూ.6 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు పట్టివేత - fake seeds worth six crore rupees

వానాకాలం ప్రారంభమైన దృష్ట్యా ఓవైపు రైతులు సాగుపై దృష్టి సారించగా.. మరోవైపు కొందరు అక్రమార్కులు నకిలీ విత్తనాల విక్రయాన్ని జోరుగా సాగిస్తున్నారు. నల్గొండ జిల్లాలో పోలీసులు నకిలీ విత్తన విక్రయదారుల గుట్టు రట్టు చేశారు. 13 మందిని అరెస్టు చేశారు.

fake seeds, fake seeds caught in nalgonda
నకిలీ విత్తనాలు, నకిలీ విత్తనాలు పట్టివేత, నల్గొండలో నకిలీ విత్తనాలు పట్టివేత

By

Published : Jun 18, 2021, 1:11 PM IST

Updated : Jun 18, 2021, 3:00 PM IST

వానాకాలం ప్రారంభమైన దృష్ట్యా రైతులు సాగుపై దృష్టి సారించారు. దుక్కిదున్ని సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు కొందరు అక్రమార్కులు కర్షకుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారికి నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు.

నల్గొండ జిల్లాలో రూ.6 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు పట్టివేత

నల్గొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాల దందా బయటపడింది. 6 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమాలకు సంబంధించి 13 మందిని అరెస్టు చేశారు. వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.

ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మధుసూదన్‌ రెడ్డిప్రధాన సూత్రధారిగా ఈ నకిలీవిత్తనం వ్యాపారం సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మధూసూదన్‌రెడ్డి నకిలీ విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడి పీడీ యాక్టు పెట్టినప్పటికీ మళ్లీ అదే వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. నైరుతి సీడ్స్‌ ఎండీ శ్రీనివాసరెడ్డి, ఎంజీ అగ్రోటెక్‌ ప్రతినిధులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు వెల్లడించారు. నాణ్యతలేని విత్తనాలు సేకరించి రంగులు వేసి.. ఏమాత్రం అనుమానం రాకుండా క్యూఆర్‌ కోడ్‌ కూడా ఉండేలా ఈ దందా సాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు.

Last Updated : Jun 18, 2021, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details