FIRING ON SMUGGLERS: ఏవోబీలో స్మగ్లర్లపై నల్గొండ పోలీసుల కాల్పులు - nalgonda police opened fire on ganja smugglers
18:50 October 17
ఏవోబీలో స్మగ్లర్లపై నల్గొండ పోలీసుల కాల్పులు
విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన లంబసింగిలో కాల్పుల కలకలం రేగింది. గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు నల్గొండకు చెందిన పోలీసులు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని కొయ్యూరు మండలం తులబాయిగడ్డ వద్ద ఇద్దరు సీఐలు, నలుగురు కానిస్టేబుళ్లు స్మగ్లర్ల కోసం గాలిస్తుండగా.. 20 మంది గంజాయి స్మగ్లర్లు నల్గొండ పోలీసులకు ఎదురుపడ్డారు. పోలీసుల కదలికలను గమనించిన స్మగ్లర్లు రాళ్లదాడి చేయడంతో... ఆత్మ రక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులతో గంజాయి స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనలో చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామానికి చెందిన కిల్లో కామరాజు, రాంబాబుకు బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ నర్సీపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏవోబీ లంబసింగి ప్రాంతంలో గంజాయి స్మగ్లర్ల కోసం వేట కొనసాగుతోంది.
ఇదీచూడండి:Road Accident: బైక్‌ను ఢీకొన్న లారీ.. తల్లీ, కుమారుడు దుర్మరణం