అమెరికాలోని ఎల్లికాట్ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువకుడు దుర్మరణం పాలయ్యాడు (Nalgonda man dies in america). ఈనెల 19న జరిగిన ప్రమాదంలో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తెరాటిగూడెంకు చెందిన మండలి శేఖర్ (28) మృతి చెందాడు. రెండేళ్ల క్రితం ఉద్యోగానికి వెళ్లిన కుమారుడి మరణ వార్త విని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. మృతుడు శేఖర్.. అమెరికాలో హాస్పిటాలిటీ టూరిజంలో మాస్టర్ డిగ్రీ చేసి.. అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. మృతదేహానికి ఇవాళ పోస్టుమార్టం నిర్వహించినట్లు బంధువులు సమాచారం ఇచ్చారు.
Nalgonda man dies in america :అమెరికాలో తెలంగాణ యువకుడు దుర్మరణం
ఉద్యోగానికి రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లిన నల్గొండ యువకుడు మృతి చెందాడు (Nalgonda man dies in america). అమెరికాలోని ఎల్లికాట్ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
sekhar
శేఖర్ మరణ వార్త తెలిసి గ్రామంలో విషాదఛాయలు అములుకున్నాయి. ఉద్యోగం కోసం వెళ్లిన కుమారుడి.. అకాల మరణంతో బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతునికి సోదరుడు, నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. శేఖర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఇదీ చూడండి:vikarabad road accident today: విద్యార్థులతో వెళ్తున్న వాహనం బోల్తా.. 8 మందికి గాయాలు
Last Updated : Nov 22, 2021, 8:44 PM IST