Murders in Kamareddy: కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాకు చెందిన విస్లావత్ అనిత... జిల్లా కేంద్రానికి కూలీ పనులు చేసుకోవడానికి వెళుతుండేది. ఈ క్రమంలో లింగంపేట మండలం పర్మల్ల తండాకు చెందిన ప్రకాశ్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అనితకు ప్రకాశ్ లక్ష రూపాయలు ఇచ్చాడు. గత నెల 17న దేవునిపల్లి శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరు శారీరకంగా కలిసిన అనంతరం వారి మధ్య డబ్బుల ప్రస్తావన వచ్చింది. అయితే తనతో ఏర్పరుచుకున్న శారీరక సంబంధంతో ఆ డబ్బులు చెల్లిపోయాయని అనిత చెప్పగా... ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ క్రమంలో ప్రకాశ్ అనితను చున్నీతో గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం కాళ్లకు ఉన్న కడియాలు తీసుకుని పారిపోయాడు.
అనిత కనపడటం లేదని నమోదైన మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా ఆధారంగా ప్రకాశ్‌ను విచారించగా తానే హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు. మహిళను హతమార్చిన ప్రదేశాన్ని పోలీసులకు చూపించాడు.
మరో హత్య కేసులో...
Murders in Kamareddy: జిల్లాలోని తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన కుంట స్వరూప భర్త మరణించాడు. ఆమె రోజూ కామారెడ్డికి కూలీ పనికి వెళ్లేది. భర్త తమ్ముడు రాజు కూడా పనికి వెళ్లేవాడు. ఈ క్రమంలో రాజు, స్వరూప వివాహేతర బంధం ఏర్పడింది. అప్పుడప్పుడు స్వరూప వద్ద రాజు డబ్బులు తీసుకునేవాడు. కొద్దిరోజులుగా రాజు డబ్బులు అడిగితే ఇవ్వడం మానేయడం, సఖ్యతగా ఉండటం కూడా మానేసింది. గత అక్టోబర్ 28న స్వరూపను తీసుకుని మాచారెడ్డి మండలం వాడి గ్రామ శివారులోని ఓ చెరుకు తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ రాజు తన కోరిక తీర్చుకున్న అనంతరం స్వరూపను చీర కొంగుతో హత్య చేసి ఆమె పర్సులో ఉన్న 800 రూపాయలతో అక్కడి నుంచి పారిపోయాడు.