తెలంగాణ

telangana

ETV Bharat / crime

Murder: మద్యం మత్తులో కత్తితో పొడిచి దారుణ హత్య - మద్యం మత్తులో కత్తితో పొడిచి దారుణ హత్య

హైదరాబాద్​ పాతబస్తీలో హత్య జరిగింది. డబీర్​పురా శ్మశానవాటిక కేర్​ టేకర్​ కుమారుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

murder in dabeerpura burial ground
డబీర్​పురా శ్మశాన వాటికలో దారుణ హత్య

By

Published : May 29, 2021, 6:59 AM IST

శ్మశానవాటిక కేర్​ టేకర్​ కుమారుడు ఫైజల్​(36) హత్యకు గురైన ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని డబీర్​పురా పీఎస్​ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. డబీర్​పురా బడా ఖబ్బస్తాన్​లో తవ్విన గుంతపై తలెత్తిన వివాదంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కత్తితో ఫైజల్​పై దాడి చేశాడు. కత్తి పోట్లతో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందినట్లు వారు పోలీసులకు తెలిపారు.

నిందితుడిగా అనుమానిస్తున్న అబ్దుల్లా మద్యానికి బానిసైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:Brutal murder: కుమార్తెను ప్రేమించాడని ముక్కలు ముక్కలుగా నరికి..

ABOUT THE AUTHOR

...view details