రోడ్డు పక్కన నిల్చుని డబ్బులు లెక్క పెడుతున్న కూలీపై దాడిచేసి డబ్బులు దొంగతనం చేసిన ఘటన హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పరిధిలో చేసుకుంది. ఆసిఫ్ నగర్ పరిధిలోని ఉషోదయ కాలనీలో సెంట్రింగ్ పని చేసుకునే కృష్ణ అనే వ్యక్తి పని చేసిన కూలీ డబ్బులు తీసుకున్నాడు. రోడ్డు పక్కన నిలబడి ఆ డబ్బులు లెక్క పెడుతుండగా.. యాదగిరి అనే నిందితుడు కృష్ణని కత్తితో పొడిచి( Murder Attempt) డబ్బులతో సహా పరారయ్యాడు.
Murder Attempt: డబ్బుల కోసం వ్యక్తిపై కత్తితో దాడి - తెలంగాణ వార్తలు
అతడు చేసేది సెంట్రింగ్ పని. రోజంతా చేసిన పనికి వచ్చిన కూలీ డబ్బులు రోడ్డు పక్కన లెక్క పెట్టడమే అతడికి శాపం అయ్యింది. డబ్బుల కోసం ఓ నిందితుడు కత్తితో పొడిచి పరారయ్యాడు.
Murder attempt in Hyderabad
గాయపడ్డ బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడి వెంట మరికొంత మంది ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చుడండి: యూపీ భాజపాలో లుకలుకలు- యోగికి పార్టీ మద్దతు