ఏపీలోని అనంతపురం శివారు ఎర్రనేల కొట్టాల కాలనీకి చెందిన హాజీ అనే వ్యక్తికి షేక్షావలీ రూ.వెయ్యి ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో డబ్బు ఇవ్వాలంటూ హాజీ... షేక్షావలీతో ఘర్షణకు దిగాడు. అనంతరం తన మిత్రులతో కలిసి హాజీ... షేక్షావలీని కత్తితో 13 చోట్ల పొడిచాడు.
దారుణం: రూ.1000 కోసం 13 కత్తిపోట్లు.. బాధితుడి పరిస్థితి విషమం - ananthapuram crime news
ఏపీలోని అనంతపురంలో దారుణం జరిగింది. వెయ్యి రూపాయల కోసం ఓ వ్యక్తిని దారుణంగా పొడిచారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు.
murder attempt, ap crime news
అప్రమత్తమైన స్థానికులు బాధితుడిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లినట్లు బంధువులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అనంతపురం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ వెల్లడించారు.
ఇదీ చదవండి:ట్రాక్టర్ బోల్తా.. ఓ వ్యక్తి మృతి, 12 మందికి గాయాలు