నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని హైమదీ బజార్లో పాత నిర్మాణాలను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. మేకల సంత జరిగే ప్రదేశంలో రూ.6కోట్లతో నూతనంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించనున్నారు. పోలీసు బందోబస్తు మధ్య పాత నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేయించారు.
పాత భవనాల కూల్చివేత... అడ్డుకున్న భాజపా కార్యకర్తలు అరెస్ట్ - తెలంగాణ లేటెస్ట్ న్యూస్
నిజామాబాద్ నగరంలో పాత నిర్మాణాలను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. వీటిని అడ్డుకున్న పలువురు భాజపా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రదేశంలో నూతనంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించనున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ తెలిపారు.
పాత భవనాల కూల్చివేత... అడ్డుకున్న భాజపా కార్యకర్తలు అరెస్ట్
పాత నిర్మాణాల కూల్చివేతకు కొందరు భాజపా కార్యకర్తలు అడ్డు చెప్పగా.. వారిని పోలీసులు అరెస్టు చేసి నాల్గో పట్టణ ఠాణాకు తరలించారు. ప్రతిపాదిత స్థలంలో వ్యాపారం చేసుకునే వారికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో అవకాశం కల్పిస్తామని నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ జితేష్ పాటిల్ తెలిపారు.
ఇదీ చదవండి:తిరుమలలో బాలుడి కిడ్నాప్ కేసులో పురోగతి