తెలంగాణ

telangana

ETV Bharat / crime

మున్సిపల్​ కమిషనర్​ భార్య ఆత్మహత్య - Commissioner balakrishna wife suicide case

Commissioner's wife commits suicide in Mancherial: ఇంటికి ఉద్యోగం చేసుకుని ఆనందంగా గడుపుదాం అనుకొన్న ఓ ఉద్యోగికి బాధే మిగిలింది. కళ్ల ముందే తన భార్య మృతదేహాన్ని చూసి కళ్లలో నుంచి కన్నీటి చుక్కులు జలధారలాగా వచ్చాయి. మంచిర్యాల జిల్లాలోని పురపాలక సంఘం కమిషనర్​ భార్య ఆత్మహత్య చేసుకుంది.

sui
sui

By

Published : Feb 7, 2023, 8:18 PM IST

Commissioner's wife commits suicide in Mancherial: మంచిర్యాల పురపాలక సంఘం కమిషనర్ బాలకృష్ణ సతీమణి జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్న భోజన సమయానికి ఇంటికి వచ్చిన కమిషనర్ తలుపు తట్టాడు. ఇంటి లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో ఎంతసేపటికి ఎవరు తలుపులు తెరవలేదు. దీంతో ఆయన ఆందోళనతో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లే సరికి ఫ్యానుకు ఉరి వేసుకుని జ్యోతి విగత జీవిగా కనిపించింది.

ఆమె అలా కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలిసిన స్థానిక ప్రజాప్రతినిధులు మున్సిపల్ కమిషనర్​ని పరామర్శించారు. ఆయన భార్య కోల్పోవడంతో కమిషనర్ రోదన అందర్నీ కలిసివేసింది. పాఠశాల నుంచి వచ్చిన తమ పిల్లలకు ఏమి సమాధానం చెప్పాలి అంటూ రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంఘటన స్థలాన్ని మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్​నాథ్ పరిశీలించారు. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details