మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధి బహదూర్పల్లిలో అక్రమ రసాయనాల గోదాంను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకపోవడమే కాక భద్రతా చర్యలు సైతం లేవని కమిషనర్ జ్యోతి తెలిపారు.
అక్రమ రసాయనాల గోదాం సీజ్.. - Medchal District Latest News
మేడ్చల్ జిల్లా బహదూర్పల్లిలో అక్రమ రసాయనాల గోదాంను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు, భద్రతా ఏర్పాట్లు లేవని తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నామని కమిషనర్ జ్యోతి వెల్లడించారు.
అక్రమ రసాయనాల గోదాంను మున్సిపల్ అధికారుల సీజ్
వేసవికాలం వస్తున్నందున అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని దాన్ని సీజ్ చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. తీవ్ర దుర్వాసన గల రసాయనాల గోదాం నిర్వహిస్తున్నారన్న స్థానికుల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:అన్నదాత అనుభవసారం.. సేంద్రియ రైతుల సమ్మేళనం