TOLLYWOOD DRUGS CASE: డ్రగ్స్ కేసులో ముమైత్ఖాన్ను ప్రశ్నిస్తున్న పోలీసులు - kelwin drugs
10:26 September 15
TOLLYWOOD DRUGS CASE: డ్రగ్స్ కేసులో ముమైత్ఖాన్ను ప్రశ్నిస్తున్న పోలీసులు
టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. సినీనటీ ముమైత్ఖాన్ను ఈడీ అధికారులు ఉదయం నంచి ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అందులో అనుమానాస్పదంగా కనిపించిన లావాదేవీల గురించి ప్రశ్నిస్తున్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ముమైత్ సమాధానమిస్తున్నారు. ఈడీ అధికారులు ఇప్పటికే సినీ రంగానికి చెందిన 9 మందిని ప్రశ్నించారు. మత్తుమందు సరఫరాదారులైన కెల్విన్, వాహిధ్లను కూడా ఇదివరకే విచారించారు.
ఎఫ్‌క్లబ్‌లో జరిగే పార్టీలకు హాజరయ్యారా? మీరు ఎప్పుడైనా మాదకద్రవ్యాలు వినియోగించారా? మాదకద్రవ్యాలు వినియోగించే సెలబ్రిటీలతో మీకు ఏమైనా సంబంధాలున్నాయా? అనే అంశాలపై క్షుణ్ణంగా విచారించారు. దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మీతో కలిసి ముమైత్ ఖాన్ పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వారిద్దరిని ఈడీ అధికారులు విచారించారు.