తెలంగాణ

telangana

ETV Bharat / crime

అధిక వడ్డీ ఆశచూపి మోసం.. సీసీఎస్‌లో బాధితుల ఫిర్యాదు - promising high interest in hyderabad

హైదరాబాద్‌ హబ్సిగూడలో బోర్డు తిప్పేసిన మల్టీ జెట్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ బోర్డుపై బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. లక్ష డిపాజిట్ చేస్తే రోజుకు 2 శాతం వడ్డీ ఇస్తామని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

Multijet Trading Private Limited cheated by promising high interest in hyderabad
లక్షకు 2 శాతం వడ్డీ అని... చివరకు కుచ్చుటోపీ పెట్టారిలా!

By

Published : Nov 15, 2022, 7:40 PM IST

రియల్ ఎస్టేట్ ముసుగులో ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా ప్రజలను మోసం చేసింది. ఈ ఘటనను ఈనాడు వెలుగులోకి తీసుకువచ్చింది. అయితే మోసపోయిన బాధితులు హైదరాబాద్‌ సీసీఎస్‌ను ఆశ్రయించారు. ప్రజల నుంచి లక్షల రూపాయలను వసూలు చేసిన మల్టీ జెట్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో.. డబ్బులు ఇన్వెస్ట్ చేసిన బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి ప్రధాన కారకుడైన రియల్ లైఫ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఓనర్.. టేకుల ముక్తి రాజ్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు.

లక్ష డిపాజిట్ చేస్తే రోజుకు 2 శాతం వడ్డీ ఇస్తామని ఆశచూపారని.. మొదట్లో కొంత మొత్తంలో కమిషన్‌ను ఇచ్చారని.. నమ్మకంతో ఒక్కొక్కరం రెండు నుంచి ఇరవై లక్షల వరకు డిపాజిట్లు చేశామని బాధితులు వాపోయారు. మొదట్లో కొంతమొత్తంలో కమిషన్‌ను ఇచ్చారని బాధితులు తెలిపారు. ఆ తర్వాత నమ్మకంతో రెండు నుంచి 20లక్షల వరకు డిపాజిట్లు చేశామని బాధితులు పేర్కొన్నారు.

''మొదట్లో కొంత మొత్తంలో కమిషన్‭ను ఇచ్చారు. ఆ తర్వాత నమ్మకంతో రెండు నుంచి ఇరవై లక్షల వరకు డిపాజిట్లు చేశాం. సుమారు 7 నుంచి 8వేల మంది వారి మాటలు నమ్మి కోట్లలో డిపాజిట్ చేశారు. ఇప్పుడు కార్యాలయాన్ని మూసేసి పరారయ్యారు. మోసపోయామని తెలుసుకుని.. తమకు న్యాయం చేయాలని సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాం. సంస్థ నిర్వహకుడుపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాం.'' - బాధితులు

అధిక వడ్డీ ఆశచూపి మోసం.. సీసీఎస్‌లో బాధితుల ఫిర్యాదు

ఇవీ చూడండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details