ACB caught MRO: ఎన్ని చర్యలు తీసుకున్నా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల తీరు మాత్రం మారడం లేదు. ఎంత మంది అనిశాకు చిక్కినా భయపడడం లేదు. లంచాలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా రైతు నుంచి 40 వేలు లంచం తీసుకుంటూ సంగెం మండలం ఎమ్మార్వో ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండలో జరిగింది. కాపుల కనుపర్తికి చెందిన కుమార్ అనే రైతు కొంత భూమిని తన సోదరి పేరు మీద మార్చాలనుకున్నాడు. ఈ విషయం గురించి ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ 3 నెలలుగా తిరుగుతున్నాడు. అయినా పనికాలేదు. పని జరగాలంటే తహశీల్దార్ 40వేలు రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
వీళ్లు మారరు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో.. - ఎమ్మార్వోను పట్టుకున్న ఏసీబీ అధికారులు
ACB caught MRO: నిన్న సంగారెడ్డిలో ఎమ్మార్వో అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేసి సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటనను అయినా చూసి బుద్ధి తెచ్చుకోవాలి కదా.. అదీలేదు ఇవాళ హన్మకొండలో తహసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో
దీంతో కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. హన్మకొండలోని తహశీల్దార్ ఇంట్లో కుమార్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం తహశీల్దార్ కార్యాలయంతో పాటు అతని ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ హరీశ్ కుమార్ తెలిపారు. ఈ సోదాలను గోప్యంగా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి: