SMUGGLING MARJUANA THROUGH AMAZON: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ కేంద్రంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ‘అమెజాన్’ ద్వారా ఆన్‌లైన్‌లో గంజాయి స్మగ్లింగ్(smugling marjuana thruough amazon) జరుగుతున్నట్లు మధ్యప్రదేశ్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఈ మేరకు నగరానికి వచ్చి గంజాయిని సరఫరా చేసే శ్రీనివాస్ అనే వ్యక్తితో పాటు అమెజాన్ పికప్ బాయ్స్ కుమారస్వామి, కృష్ణంరాజు, వెంకటరమణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారిచ్చిన సమాచారం మేరకు విశాఖలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ నెల 13న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో ఓ దాబాలో గంజాయి పట్టుబడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా విశాఖ నుంచి అమెజాన్ యాప్ ద్వారా గంజాయి అక్కడికి వచ్చినట్లు గుర్తించారు. విశాఖ నుంచి వచ్చిన గంజాయిని పికప్ చేసుకునే ముగ్గురిని మధ్యప్రదేశ్‌లోని బెండీ ప్రాంతంలో అరెస్టు చేశారు. ఆ కేసులో భాగంగానే విచారణ నిమిత్తం మధ్యప్రదేశ్ పోలీసులు ఇవాళ విశాఖ చేరుకున్నారు. వీరితో పాటు ఎస్ఈబీ అధికారులు కూడా రంగంలోకి దిగారు.