Costume designer suspicious death: మేడ్చల్ జిల్లాలోని కేపీహెచ్‌బీలో ఓ కాస్ట్యూమ్ డిజైనర్ అనుమానస్పదస్థితిలో మృతిచెందాడు. రమ్య గ్రౌండ్స్ నాలాలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు... ఆధారాలు సేకరించి విచారణ చేపట్టారు.
Costume designer suspicious death: కేపీహెచ్‌బీ నాలాలో కాస్ట్యూమ్ డిజైనర్ మృతదేహం... - కేపీహెచ్‌బీలో కాస్ట్యూమ్ డిజైనర్ మృతి
Costume designer suspicious death: అనుమానాస్పద స్థితిలో ఓ కాస్ట్యూమ్ డిజైనర్ మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లాలోని కేపీహెచ్‌బీలో చోటుచేసుకుంది. రమ్య గ్రౌండ్స్ నాలాలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని విచారణ చేపట్టారు.
Costume designer suspicious death
మృతుడి జేబులో లభించిన వివరాల ఆధారంగా.. చనిపోయిన వ్యక్తి అదే ప్రాంతంలో నివాసముంటున్న క్యాస్ట్యూమ్ డిజైనర్ వాసుగా గుర్తించారు. ఘటనాస్థలంలో లభించిన సీసాల ఆధారంగా వాసు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:women suicide in Godavarikhani : ఆస్పత్రిలో ఉరేసుకుని బాలింత ఆత్మహత్య