అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు జరిపి మానవత్వం చాటుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కమిషనర్, సిబ్బంది. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆలకుంట్ల పరమేశ్(32) సోమవారం ఉదయం మృతి చెందాడు.
మానవత్వం చాటుకున్న మోత్కూరు మున్సిపల్ సిబ్బంది - mothkuru municipality
అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు జరిపి మానవత్వం చాటుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కమిషనర్. తండ్రి మరణం, తల్లికి కరోనా సోకడం వల్ల ముగ్గురు ఆడపిల్లలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.
మోత్కూరు మున్సిపల్ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
మృతుని భార్యకు కరోనా సోకడం, దహన సంస్కారాలకు బంధువులు, స్థానికులు ముందుకు రాకపోవడం వల్ల స్థానిక కౌన్సిలర్లు మోత్కూర్ మున్సిపల్ కమిషనర్‌కు సమాచారం అందించారు. మున్సిపల్ కౌన్సిలర్ తన సిబ్బందితో కలిసి పరమేశ్ అంత్యక్రియలు జరిపారు. మృతునికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అనారోగ్యంతో తండ్రి మరణించడం, తల్లికి కరోనా పాజిటివ్ రావడం వల్ల ఆ చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.