Mother Suicide Attempt: వేములవాడలో పిల్లల గొంతు కోసి తానూ గొంతుకోసుకున్న తల్లి - Telangana news
17:27 December 18
పిల్లల గొంతు కోసి తానూ గొంతుకోసుకున్న తల్లి మమత
Mother Suicide Attempt: వేములవాడలో పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన మమత, కుమార్తె అక్షయ, వరుణ్తేజతో పాటు తానూ గొంతుకోసుకుంది. వీరిని గమనించిన స్థానికులు సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. తక్షణ చికిత్స వల్ల ముగ్గురికి ప్రాణాపాయం తప్పింది.
కుటుంబ కలహాల వల్ల పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితులు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం వాసులుగా గుర్తించారు. మెట్టింటికి వెళ్లేందుకు ఉదయం పుట్టింటి నుంచి బయలుదేరిన మమత... వేములవాడ శివారులో అఘాయిత్యానికి ఒడిగట్టింది.
ఇవీ చూడండి: