తెలంగాణ

telangana

ETV Bharat / crime

Son Murdered Mother: పెళ్లి చేయట్లేదనే కోపంతో... తల్లిని చంపిన కొడుకు - Son Beat Woman To Death at Krishna district

ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలో దారుణం(Son Murdered Mother) జరిగింది. తనకు పెళ్లి చేయట్లేదనే కోపంతో.. ఓ కొడుకు క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి తల్లిని హతమార్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Son Murdered Mother
Son Murdered Mother

By

Published : Nov 26, 2021, 8:09 AM IST

Mother Murdered by Son: తనకు పెళ్లి చేయట్లేదన్న కోపంతో ఓ కుమారుడు... ఏకంగా తన తల్లినే హతమార్చాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. శంకర్రాజు, వెంకటేశ్వరమ్మ దంపతులు.. మచిలీపట్నంలోని పరాసుపేటలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న పెద్ద కుమారుడు. తనకు పెళ్లి చేయాలంటూ తరచూ తల్లితో గొడవ(Son Murdered Mother at parasu peta) పడేవాడు.

ఇటీవల వచ్చిన సంబంధం కూడా ఆమె వల్లే తప్పిపోయిందనే కోపంతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో క్రికెట్‌ బ్యాట్‌తో తలపై బలంగా కొట్టి(Machilipatnam Murder case) పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వెంకటేశ్వరమ్మను.. భర్త శంకర్రాజు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:గుట్టుగా ఉన్న వివాహేతర సంబంధం ఇంట్లో తెలిసిందని.. ఇద్దరూ కలిసి..

ABOUT THE AUTHOR

...view details