Mother Who Left Her Baby In The Sun: అమ్మ నేను ఈ భూమి మీదకు రావాలనుకుంటున్నాను. అందరిలాగే నాకు కూడా జీవించాలని ఉందని అంటూ ఓ పసికందు ఏడుస్తుంది.. అయినా నీ మనసు కరగలేదా.. ఎందుకమ్మా ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే తుంచేయాలని చూస్తుంది ఈ సమాజం. నేను ఏం పాపం చేశాను. ఆడపిల్లగా పుట్టడమేనా నేను చేసిన పాపమా. మగ పిల్లాడిలా నాకు కూడా ఈ భూమి మీద జీవించే సమాన హక్కులు ఉన్నాయి. అన్నింటిలోనూ వారిలాగే మేము కూడా రాణించగలుగుతున్నాము. పిల్లలు లేక ఎందరో డాక్టర్లు, పుణ్య క్షేత్రాలు అంటూ తిరుగుతూ ఉంటే.. పిల్లలు పుట్టిన నీకు ఎందుకమ్మా.. ఆడపిల్ల అని తెలియగానే వదిలేయాలని పించింది అంటూ ఏ ఆడపిల్ల రోధిస్తోంది.
ఆడపిల్ల అని తెలిస్తే కొందరి కర్కష తండ్రులు వదిలేయాలని చూస్తారు. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా మానవత్వం లేని ఓ తల్లినే ఇలా చేసింది. తాను అమ్మ కాకముందు.. ఆడపిల్లనే కదా నేను అన్న కూడా విషయం మరిచిపోయి ప్రవర్తించింది. నవమాసాలు తర్వాత ఆడపిల్ల పుట్టిందని తెలిసి గుట్టుచప్పుడు కాకుండా వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయి.. అమ్మతనానికి చేరగని మచ్చ తెచ్చే విధంగా చేసింది. ఈ విషాదకరమైన గుండెలను పిండేసే ఘటన హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లో అయోధ్యనగర్లో జరిగింది.