తెలంగాణ

telangana

ETV Bharat / crime

కుటుంబ కలహాలకు పసివాళ్లు బలి.. తల్లే చంపేసింది! - Kadapa District Latest News

కుటుంబ కలహాలతో ఓ తల్లి విచక్షణ కోల్పోయింది. గోరు ముద్దలు తినిపించిన చేతులతోనే.. పిల్లల గొంతు నులిమి చంపేసింది. అనంతరం తానూ విషం తాగింది. ఏపీలోని కడప జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

mother-killed-three-children-in-kadapa-district
కుటుంబ కలహాలకు పసివాళ్లు బలి.. తల్లే చంపేసింది!

By

Published : Mar 19, 2021, 8:37 AM IST

కన్నతల్లే.. తన పిల్లలను గొంతు నులిమి కడతేర్చిన విషాద ఘటన ఏపీ, కడప జిల్లాలో జరిగింది. ఈ అమానుష ఘటనలో.. అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులు మృతి చెందగా.. ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

పెండ్లిమర్రి మండలం మిట్టమీదపల్లెకు చెందిన నిత్య పూజారి, నరసమ్మకు ముగ్గురు పిల్లలు. కుటుంబంలో నెలకొన్న చిన్నపాటి తగాదాల వల్ల.. తీవ్ర మనస్తాపానికి గురైన నరసమ్మ, ఇంట్లో భర్త లేని సమయం చూసి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. పిల్లలను చంపి, తానూ పురుగుల మందు తాగింది. అత్త పేరిట ఉన్న భూమి విషయంలో.. నరసమ్మ భర్తతో కొంతకాలంగా ఘర్షణ పడుతున్నట్లు బంధువులు తెలిపారు.

ఇదీ చదవండీ:మైనర్​ బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details