భర్తపై కోపంతో పసికందును చంపి.. భార్య ఆత్మహత్యాయత్నం - తెలంగాణ నేర వార్తలు
![భర్తపై కోపంతో పసికందును చంపి.. భార్య ఆత్మహత్యాయత్నం mother killed son](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14234032-1024-14234032-1642661218500.jpg)
12:10 January 20
Mother killed Son: చిన్నారిని బలి తీసుకున్న భార్యాభర్తల గొడవ
Mother killed Son: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ బంజారాకాలనీలో దారుణం జరిగింది. భార్యాభర్తల గొడవ ఏడు నెలల చిన్నారిని బలితీసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా మల్లేపల్లికి చెందిన సువర్ణ, వెంకటేశ్ కొంతకాలంగా బంజారా కాలనీలో నివాసం ఉంటున్నారు.
వారం రోజుల క్రితం ఇంట్లో భర్తతో గొడవ పడిన భార్య.. తనతో పాటు ఏడు నెలల బాలుడిపై శానిటైజర్ పోసి నిప్పటించుకుంది. తల్లి సువర్ణ గాయాలతో బయటపడగా.. చికిత్స పొందుతూ చిన్నారి బుధవారం రాత్రి మృతి చెందాడు. తల్లిపై హత్య కేసు నమోదు చేసిన హయత్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:నరబలి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం.. ఇంకా దొరకని నిందితులు