తెలంగాణ

telangana

ETV Bharat / crime

mother killed daughter: రెండేళ్ల కూతురును చంపి.. తల్లి ఆత్మహత్యాయత్నం - అనంతపురం జిల్లా ప్రధాన వార్తలు

భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ.. రెండేళ్ల చిన్నారికి పట్ల మరణ శాసమమైంది. జన్మనిచ్చిన తల్లే.. కత్తితో పొడిచి కడతేర్చింది. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ దారుణమైన ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటుచేసుకుంది.

mother killed daughter
mother killed daughter

By

Published : Aug 13, 2021, 4:28 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరంలోని కొత్తపేటలో దారుణం చోటుచేసుకుంది. రెండున్నరేళ్ల చిన్నారిని కన్న తల్లే చంపేసింది. కొత్తపేట కాలనీలో మీనాక్షి, శ్రీనివాసులు దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. శ్రీనివాసులు చేనేత పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతుల మధ్య గత కొంతకాలంగా చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం శ్రీనివాసులు తన పెద్ద కుమార్తె తనుశ్రీని తీసుకుని బయటకు వెళ్లాడు.

అదే సమయంలో మీనాక్షి.. తన చిన్న కుమార్తె ప్రణతి(2)ని కత్తితో పొడిచి చంపేసింది. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే భర్త శ్రీనివాసులుకు సమాచారం అందించారు. ఇంటికి చేరుకున్న శ్రీనివాసులు... మీనాక్షిని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న ధర్మవరం పట్టణ సీఐ కరుణాకర్‌ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

baby died: 'జామకాయ' ఆ పసిపాపను చంపేసింది!

ABOUT THE AUTHOR

...view details