తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆశలు ఆవిరయ్యాయని... ఐదేళ్ల కుమార్తెతో సహా తల్లి బలవన్మరణం! - telangana varthalu

జీవితంపై ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఆమెను భర్త వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. మళ్లీ పెళ్లి చేసుకుంటే రెండో భర్త తాగుడుకు బానిసై అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురును పోషించలేక జీవితంపై విరక్తి చెంది కూతురుతో కలిసి ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో జరిగింది.

mother-including-her-five-year-old-daughter-committed-suicide
mother-including-her-five-year-old-daughter-committed-suicide

By

Published : Aug 26, 2021, 7:22 PM IST

పటాన్‌చెరులో కుమార్తె సహా తల్లి ఆత్మహత్య

జీవితంలో తోడు ఉంటాడని పెళ్లి చేసుకున్న భర్త వదిలేసి వెళ్లిపోయాడు. పోనీ మళ్లీ పెళ్లి చేసుకున్నా.. తాగుడుకు బానిసై అప్పులపాలై ఇంకో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురును పోషించలేక జీవితంపై విరక్తి చెంది కూతురుతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జరిగింది. సంగారెడ్డి జల్లా పటాన్‌చెరు రాఘవేంద్రకాలనీలో ఉంటున్న వింధ్య, ఆమె సోదరుడు రాజు బతుదెరువుకోసం వచ్చి తొలుత పటాన్‌చెరు శాంతినగర్‌కాలనీలో ఉంటున్నారు. వింధ్యకు పెళ్లయిన తర్వాత మొదటి భర్త వదిలి వెళ్లిపోయాడు. అనంతరం సిరిగాపూర్‌ మండలం కడపల్‌కు చెందిన దేవదాస్‌తో పెళ్లయ్యింది. అతను మద్యానికి బానిసై అప్పుల బాధ భరించలేక ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పటినుంచి రాఘవేంద్రకాలనీలో కూతురు గ్లోరి(5)తో కలిసి ఉంటూ ఇస్నాపూర్‌ శివారులో మహేశ్వర మెడికల్‌ కళాశాలలో నర్సుగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. రెండో భర్త దేవదాస్‌ నారాయణఖేడ్‌ డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తూ చనిపోవడంతో డిపో నుంచి డబ్బులు వస్తాయని చెప్పి.. ఈనెల 25వ తేదీన శాంతినగర్‌ కాలనీలో ఉంటున్న సోదరుడు రాజు వద్దకు వెళ్లింది. రాజు సరే వెళ్దాం అని చెప్పాడు. తర్వాత డబ్బులు ఇప్పుడు రావడం లేదని తమ ఇంటికి వెళుతున్నానని చెప్పి వింధ్య వెళ్లిపోయింది. అక్కడి నుంచి నేరుగా సాకిచెరువు వద్దకు వెళ్లి బుధవారం రాత్రి తన కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: HUSBAND TORTURE: కంటే కొడుకునే కనమని టార్చర్‌ చేస్తున్నాడు.. నేను చేసింది తప్పా?

ABOUT THE AUTHOR

...view details