Mother and daughter died in mulugu : కుమార్తె మరణ వార్త విని తల్లి గుండె ఆగింది! - తెలంగాణ వార్తలు
13:00 December 26
కుమార్తె మరణ వార్త విని తల్లి మృతి
Mother and daughter died in mulugu : ములుగు జిల్లా వెంకటాపురం మండలం మొర్రివానిగూడెంలో విషాదం నెలకొంది. బిడ్డ మరణాన్ని తట్టుకోలేక ఓ తల్లి గుండె ఆగింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె ఇకలేదని తెలిసి... ఆమె హఠాన్మరణం పాలైంది.
అనారోగ్యంతో కుమార్తె దీపప్రియ శనివారం రాత్రి మృతి చెందింది. కూతురు మరణ వార్త విని తల్లి దేవమ్మ కుప్పకూలింది. గంటల వ్యవధిలోనే తల్లీకుమార్తె మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి:two died in wall collapse Shankarpally : ఇంటి గోడ కూలి ఇద్దరు యువకులు దుర్మరణం