Andhra Pradesh crime news : ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో దారుణం జరిగింది. మద్యం మత్తులో కుమారుడు.. తల్లిని చితకబాదాడు. చికిత్స పొందుతూ తల్లి కంచుమోజు రమణ(55) మృతి చెందారు. మూడో రోజుల క్రితం తల్లిపై దాడి చేయగా.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని..
కడప జిల్లా వేంపల్లె మండలంలోని వీరన్నగట్టుపల్లె బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వేంపల్లెకు చెందిన జగదీష్ (25) అనే యువకుడు మృతి చెందాడు. వేంపల్లెలోని కాలేజి రోడ్డులో నివాసం ఉన్న జగదీష్ డ్రైవర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దాదాపు 6 సంవత్సరాలు క్రితం ఇడుపులపాయలో శాంతి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి వేంపల్లె నుంచి ఇడుపులపాయకు బైక్పై వెళ్లుతుండగా వీరన్నగట్టుపల్లె బ్రిడ్జి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో మృతి చెందాడని బంధువులు తెలిపారు. స్థానికుల, బంధువుల సమాచారంతో వేంపల్లె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని వేంప్లలె ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించడం జరిగింది.