ఏపీలోని చిత్తూరు జిల్లా వి.కోట మండలం అట్రపల్లెలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లల గొంతుకోసి.. తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు ప్రాణాపాయస్థితిలో ఉన్న ముగ్గురిని కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పిల్లల గొంతు కోసి.. తానూ కోసుకున్న తల్లి - kuppam latest news
ఏపీలోని చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లల గొంతు కోసిన తల్లి.. తానూ ఆత్యహత్యాయత్నం చేసింది. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
చిత్తూరులో పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
అట్రపల్లెకు చెందిన ఆనంద్- మీనాక్షి దంపతులకు ఐదేళ్ల కుమార్తె, ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. కొద్ది కాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ సమస్యలు తలెత్తడం వల్ల మనస్తాపానికి గురైన మీనాక్షి.. ఇద్దరు పిల్లల గొంతుకోసి.. తానూ ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కుప్పం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవీచూడండి:సర్పంచ్, ఉపసర్పంచ్ వర్గాల మధ్య ఫైటింగ్