Suicide: హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో విషాదం వెలుగుచూసింది. కుటుంబ కలహాలు ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాయి. ఇద్దరు పిల్లలను చంపి తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని పోట్వీ కాలనీలో శ్రీనివాస్ అపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయి, స్వాతి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కుమారుడు తన్విక్(5), కుమార్తె శ్రేయ ఉన్నారు. సాయి చేసిన అప్పులు తీర్చలేక తరచూ భార్యతో గొడవకు దిగేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపంతో సాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు.
Suicide: భర్త వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య - telangana varthalu
19:22 December 11
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
మనస్తాపం చెందిన స్వాతి చనిపోవాలని నిర్ణయించుకుంది. తాను చనిపోతే పిల్లలు దిక్కులేని వారై పోతారని ఆలోచించింది. భర్త వేధింపులు తాళలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ లెటర్ రాసి ముందుగా ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తెకు ఉరివేసి.. తానూ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇవాళ భర్త సాయి తిరిగి ఇంటికి వెళ్లి చూడగా.. భార్య, పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
Road accident: అబ్దుల్లాపూర్మెట్లో లారీ బీభత్సం.. ఇంజినీరింగ్ విద్యార్థి మృతి