భార్యభర్తల మధ్య కలహాలు ఆ ఇంట్లో విషం చిమ్మేలా చేశాయి. గొడవలతో మనస్తాపానికి గురైన ఓ తల్లి.. తన ఇద్దరు పిల్లకు విషమిచ్చి.. తానూ ఆత్మహత్యకు (suicide) పాల్పడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్యాగడి తండాలో నిన్న జరిగింది.
Suicide: భర్తతో గొడవ.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య - Mother commits suicide after poisoning two children
11:33 August 03
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
Murder: రైల్వే ట్రాక్ పక్కన యువతి శవం.. అతడిపైనే అనుమానం!
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్యాగడి తండాకు చెందిన బానోత్ గోవింద్, హన్సీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. భర్త తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన హన్సీ చనిపోవాలని నిర్ణయించుకుంది. శీతల పానీయంతో పురుగుమందు కలిపి.. ఇద్దరు కుమార్తెలు పూజ(09), నందు(09)లకు ఇచ్చింది. కుమారుడు పీర్సింగ్కు కూడా ఇవ్వాలని చూడగా.. భయంతో ఆ పిల్లాడు తప్పించుకున్నాడు. దానితో వాళ్లు ముగ్గురు ఆ విషాన్ని తాగారు.
పురుగుల మందు తాగిన తర్వాత.. ఆ నొప్పిని భరించలేక అరవడంతో... చుట్టు పక్కల వారు వారిని గమనించారు. వెంటనే వారిని స్థానిక ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా... తల్లి హన్సీ ప్రాణాలను వదలింది. ఇద్దరు కుమార్తెల పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరు ప్రస్తుతం కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:women suicide: ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య.. అదే కారణమా.!