తల్లీకుమారుడు అదృశ్యమైన ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బౌరంపేట ఇందిరమ్మ కాలనీలో వేణుబాబు, భార్య సౌజన్య(23)తో కలిసి నివాసముంటున్నాడు. వారికి ఒక కుమారుడు మనోజ్(4) ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఆ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని అమ్మి ఊరెళ్లిపోదామని వేణు.. భార్యకి సలహా ఇచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. మనస్తాపం చెందిన సౌజన్య.. కుమారుడిని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది.
భార్యాభర్తల మధ్య గొడవ.. కుమారుడితో కలిసి ఇల్లాలు అదృశ్యం - mother and son missing news
భర్తతో జరిగిన గొడవలో మనస్తాపం చెందిన భార్య..కుమారుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తల్లీకుమారుడు అదృశ్యం
వేణు బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫోన్ ద్వారా వేణు బాబు భార్యను సంప్రదించగా ఆమె ఇంటికి రానని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:ఇద్దరు బిడ్డలకు పురుగుమందు తాగించిన తండ్రి