జోరువాన కారణంగా కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లి కుమారుడు మృతి చెందారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది ఈ ప్రమాదం. విజయవాడకి చెందిన దొడ్డపనేని శివరాం కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. మునగాల వద్దకు వచ్చే సరికి భారీ వర్షం పడుతుంది.
ACCIDIENT: డివైడర్ని ఢీకొట్టిన కారు... తల్లి, కుమారుడు మృతి.. - accidient at munagala mandal
సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందారు. రహదారిపై నీరు చేరడంతో ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి భార్య, కూతురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్ట్ అయ్యాయి.

భారీ వర్షానికి మునగాల జాతీయ రహదారిపై నీరు చేరడంతో.. కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. తల్లి స్వరాజ్యలక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా కుమారుడు శివరాం మృతి చెందాడు. శివరాం భార్య, కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శివరాం మైలవరం ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు మునగాల ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను, క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:Dalit Empowerment: బ్యాంక్ గ్యారంటీ లేకుండానే ఎస్సీలకు రుణాలు, ఆర్థికసాయం: సీఎం