పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఐదు నెలల పసికందును ఆస్పత్రి తీసుకెళ్లగా రోడ్డు ప్రమాదం వారిని మృత్యుఒడికి చేర్చింది. వైద్యపరీక్షల అనంతరం తిరిగి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో తల్లి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గోదావరిఖనిలోని రాజీవ్ రహదారిపై జరిగింది.
Road accident: స్కూటీని ఢీకొట్టిన లారీ.. తల్లితో సహా పసికందు మృతి - తల్లీతో సహా ఐదు నెలల పసికందు మృతి
అనారోగ్యంతో ఆస్పత్రికెళ్లిన వారి పట్ల విధి చిన్నచూపు చూసింది. తల్లితో సహా ఐదు నెలల పసికందును లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శారదానగర్లో చోటు చేసుకుంది.
జిల్లాలోని రామగుండం ఎన్టీపిసి అన్నపూర్ణ కాలనీకి చెందిన ఉప్పల అనిల్ కుమార్, రమ్య దంపతులు. తమ 5 నెలల కుమారుడు నిర్వేద్ చంద్రకు జ్వరం రావడంతో గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం ఇంటికి తిరిగొస్తుండగా రామగుండం నగరపాలక కార్యాలయం సమీపంలో అతి వేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ, ఐదు నెలల బాబు లారీ టైర్ల వెనకాల పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త అనిల్ కుమార్ ప్రాణాలతో భయటపడ్డాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా తెల్లారితే బతుకమ్మ పండుగ సంతోషంగా గడపాల్సిన భార్య, కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుటుంబం సభ్యులు బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఇదీ చూడండి:dead body found in hyderabad: కుత్బుల్లాపూర్‌లో నాలాలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం