జగిత్యాల రాయికల్ మండలం వడ్డేలింగాపూర్లో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ క్షేత్రం వద్ద మోటార్లో నీళ్లు పోస్తుండగా... జమున అనే మహిళారైతు విద్యుదాఘాతానికి గురైంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడిపోయింది.
విద్యుత్ షాక్తో తల్లి... కాపాడబోయి కొడుకు... - vaddelingapur died news
వ్యవసాయక్షేత్రం వద్ద విద్యుదాఘాతానికి గురైన తల్లి... ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. తల్లిని కాపాడేందుకు ముందూవెనకా ఆలోచించకుండా కొడుకూ దూకేశాడు. అమ్మను రక్షించుకోవాలన్న ఆ కుమారుని ఆశతో పాటు ఇద్దరినీ ముంచేసి.. విగతజీవులుగా మార్చేసింది ఆ బావి.
mother and son died drown in Agricultural well
తల్లి పడిపోవటాన్ని గమనించిన జమున కుమారుడు జ్ఞానేశ్వర్... కాపాడేందుకు బావిలో దూకాడు. అమ్మను కాపాడేందుకు దూకిన జ్ఞానేశ్వర్ ప్రయత్నం విఫలయత్నమే అయ్యింది. ఫలితంగా... తల్లీ, కుమారుడు మృత్యువాత పడ్డారు. ఇద్దరి మరణ వార్త గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... బావిలోని మృతదేహాలను బయటకు తీసి విచారణ జరుపుతున్నారు.