మంచిర్యాల జిల్లా మందమర్రిలో కరోనాతో తల్లీకుమారుడు చనిపోయారు. వైరస్ బారినపడి ఒకే ఇంట్లో ఇద్దరు మృత్యువాతపడగా.. మరొకరు వైరస్‌తో పోరాడుతూ.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
విషాదం: వైరస్ బారినపడి తల్లీకుమారుడు మృతి.. - Mancherial district corona news
కరోనా ఆ కుటుంబంలో కల్లోలం సృష్టించింది. వైరస్ బారినపడి 11 రోజుల వ్యవధిలో తల్లీకుమారుడు మృతి చెందగా.. కొవిడ్ కోరల్లో చిక్కుకున్న మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ హృదయ విదారక ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
మందమర్రి పట్టణానికి చెందిన సింగరేణి కార్మికుడు గూళ్లపల్లి రవీందర్ కరోనాతో మృతి చెందాడు. 11 రోజుల క్రితం రవీందర్ తల్లి అనసూయ వైరస్‌తో మరణించింది. కొవిడ్ బారినపడిన తల్లి వెంట ఉన్న రవీందర్‌కు పాజిటివ్ రావడంతో చికిత్స పొందుతూ కరీంనగర్లో శనివారం రాత్రి మృతి చెందాడు. రవీందర్ భార్యకూ కరోనా సోకడంతో ఆమె కరీంనగర్లో చికిత్స పొందుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. వైరస్ బారినపడి ఒకే ఇంట్లో తల్లీకుమారుడు మృతి చెందడం, మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికంగా విషాదం నెలకొంది.
ఇదీ చూడండి: దుండగుల చేతిలో 80 కుక్కలు హతం... భయాందోళనలో గ్రామస్థులు