తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఏమై ఉంటుందో: బావిలో దూకి తల్లీకుమారుడి ఆత్మహత్య..! - Mother and son commit suicide news

పదేళ్ల క్రితమే భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఆ తల్లి తన ఇద్దరు కుమారులను కంటికి రెప్పలా కాపాడుకుంది. ఇటీవలే పెద్ద కుమారునికి వివాహం జరిపించింది. ఇంతలో ఏమైందో తెలీదు కానీ.. తన చిన్న కుమారునితో కలిసి బావిలో దూకి ఉసురు తీసుకుంది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

Mother and son commit suicide by jumping into a well in jagtial
ఏమై ఉంటుందో: బావిలో దూకి తల్లీకుమారుడి ఆత్మహత్య..!

By

Published : Mar 4, 2021, 1:16 PM IST

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండాలో విషాదం చోటుచేసుకుంది. మాలావత్ ముజ్జుబాయ్ అనే మహిళ తన చిన్న కుమారుడు అరవింద్​తో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయిన తల్లీకుమారులు.. ఊరిలోని వ్యవసాయ బావిలో శవాలై తేలారు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మెట్​పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే బలవన్మరణానికి కారణమని భావిస్తున్నారు.

మృతురాలికి ఇద్దరు కుమారులు ఉండగా.. భర్త పదేళ్ల క్రితమే చనిపోయాడు. పెద్ద కుమారుడికి ఇటీవలే వివాహం జరిగినట్లు సమాచారం.

ఇదీ చూడండి: డ్రైవర్ నిర్లక్ష్యానికి.. ఓ నిండు ప్రాణం బలి

ABOUT THE AUTHOR

...view details