ఒకరినొకరు విడిచి ఉండలేమన్నా... ఆ ప్రేమికుల ప్రేమను అర్థం చేసుకోలేదు. వారి పెళ్లికి గౌరవం ఇవ్వలేదు. సరికదా... తల్లి కాబోతున్న కూతురిపై తల్లి పైశాచికంగా ప్రవర్తించిన అమానవీయ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటు చేసుకుంది. జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సునీత (19) అదే గ్రామానికి చెందిన రవికుమార్ (23) ప్రేమించుకున్నారు. ఇంట్లో వారి విషయం చెప్పినా పెద్దలు అంగీకరించలేదు.
వారి ప్రేమను గెలిపించుకునేందుకు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సునీత 8 నెలల గర్భిణి. ఆమెకు విశ్రాంతి అవసరమని డాక్టర్ చెప్పటంతో... రవికుమార్ ఆమెను తమ బంధువుల ఇంటి వద్ద ఉంచారు. విషయం తెలుసుకున్న సునీత తల్లి వెంకటమ్మ, అక్క సరిత మంగళవారం ఆమె వద్దకు వెళ్లారు. అయిపోయిందేదో అయిపోయింది... అమ్మాయిన ఆస్పత్రిలో చూపిస్తామని నమ్మించి ఆటోలో తీసుకెళ్లారు.