తెలంగాణ

telangana

ETV Bharat / crime

పండుగ పూట విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, కుమార్తె మృతి - electric shock causes mother and daughter death

Mother and Daughter died in Mancherial : పండుగ పూట ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో తల్లి, కుమార్తె మృతి చెందగా.. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

electric shock
విద్యుదాఘాతం

By

Published : Aug 31, 2022, 9:22 AM IST

Updated : Aug 31, 2022, 10:19 AM IST

Mother and Daughter died in Mancherial : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బొప్పారంలో పండగపూట విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో తల్లికుమార్తె మృతి చెందారు. భర్త పరిస్థితి విషమంగా ఉంది. నిన్న రాత్రి ఇంటి వెనుక వ్యవసాయ మోటర్‌ ఆన్‌ చేసేందుకు సరిత.. తన ఏడాది కుమార్తెతో కలిసి వెళ్లింది. ఈ క్రమంలో కరెంట్‌ తీగ కాలికి తాకింది. విద్యుదాఘాతంతో సరిత, సాన్విత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

వారిని వెతుకుతూ వెళ్లిన సమ్మయ్య కూడా షాక్‌కు గురయ్యాడు. తీవ్ర గాయాలైన అతడిని చెన్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేసుకున్నారు. విద్యుదాఘాతానికి ఇద్దరు బలికావడం, మరొకరు మృత్యువుతో పోరాడుతుండటంతో.. బొప్పారంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోదనలు కలిచివేశాయి.

Last Updated : Aug 31, 2022, 10:19 AM IST

ABOUT THE AUTHOR

...view details