తెలంగాణ

telangana

ETV Bharat / crime

Three suicide: ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య.. ఆ వార్త విని.. - west godavari district news updates

కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడన్నే నిజాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది. మనుమడు తిరిగిరాని లోకాలను వెళ్లిపోయాడనే వార్త ఆ అమ్మమ్మ హృదయాన్ని కలచివేసింది. అనుక్షణం అతని జ్ఞాపకాలతో జీవించలేక.. ఇరువురూ ఉరివేసుకుని తనువు చాలించారు. ఈ విషాద ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగింది.

suicide
ఆత్మహత్య

By

Published : Nov 10, 2021, 9:38 AM IST

ఆర్ధిక ఇబ్బందులు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి. కొడుకు ఆత్మహత్య చేసుకోగా.. అది తట్టుకోలేక అమ్మ, అమ్మమ్మ కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గొట్టుముక్కల రాధా కృష్ణ కుమారి(75), వేములవాడ ఇందిరా ప్రియ (50) దిరుసుమభ్రువారివీధిలో నివాసముంటున్నారు. ఇందిరా ప్రియ కుమారుడు వేమలమంద కార్తిక్​.. ఈనెల ఏడో తేదీన విజయవాడ గవర్నర్ పేటలోని ఒక లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నారు.

పోలీసులు అతడి మరణవార్తను భీమవరంలో ఉంటున్న బంధువులకు తెలిపారు. కార్తీక్ చనిపోయాడన్న విషయం వినగానే అతని అమ్మ ఇందిరాప్రియ, అమ్మమ్మ రాధాకృష్ణకుమారి కుంగిపోయారు. కుటుంబానికి ఏకైక ఆధారమైన కొడుకు మరణాన్ని తట్టుకోలేక కార్తీక్​ అమ్మ, అమ్మమ్మ భీమవరంలో నిన్న ఆత్మహత్య చేసుకున్నారు.

కార్తీక్ భీమవరంలో ఆక్వేరియం బిజినెస్ చేసి నష్టం రావటంతో చెన్నై వెళ్లారని బంధువులు వెల్లడించారు. చెన్నైలో కార్తీక్‌కు కొవిడ్ సోకటంతో లక్షల్లో అప్పులు చేయాల్సి వచ్చిందని.... పోలీసులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన కార్తీక్‌ విజయవాడకు వచ్చి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీచదవండి:Adulterated Meat: ముక్క లేనిదే ముద్ద దిగదా..? అయితే జాగ్రత్త

ABOUT THE AUTHOR

...view details