తెలంగాణ

telangana

ETV Bharat / crime

రైలు ఎక్కుతూ జారిపడిన తల్లీకుమార్తె.. ఆ తర్వాత..? - mother Daughter slipped from a train

Train Accident News : రైలు ఎక్కుతూ తల్లీ, కుమార్తె జారి పడిన ఘటన ఏపీలోని ఏలూరు రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కుమార్తె మృతి చెందగా తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Train Accident News
Train Accident News

By

Published : May 24, 2022, 10:58 AM IST

Train Accident News : రైలు ఎక్కుతూ జారి పడిన ఘటనలో కుమార్తె మృతి చెందగా తల్లి చికిత్స పొందుతోంది. ఈ ఘటన ఏలూరు రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా వంగాయగూడేనికి చెందిన నువ్వుల లక్ష్మి, ఆమె కుమార్తె సాయిదుర్గ (25) సోమవారం విశాఖపట్నం వెళ్లేందుకు ఏలూరు రైల్వేస్టేషన్‌కు వచ్చారు. రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగీ ఎక్కేందుకు ప్రయత్నించారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ముందు కుమార్తె సాయిదుర్గ రైలు ఎక్కి, తల్లిని పైకి లాగుతుండగా అదుపు తప్పడంతో ఇద్దరూ కింద పడిపోయారు.

ఆ సమయంలోనే రైలు కదలడంతో ఫ్లాట్‌ఫామ్‌కు బోగీకి మధ్య ఇద్దరూ ఇరుక్కుపోయారు. వారిని రైలు కొంతదూరం లాక్కెళ్లింది. ప్రయాణికులు చైన్‌ లాగడంతో రైలు ఆగింది. తీవ్రంగా గాయపడిన వారిని ఆర్‌పీఎఫ్‌ ఏఎస్సై రామారావు రైలు కిందకు వెళ్లి పైకి తీసుకొచ్చారు. తల్లీకుమార్తెను 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయిదుర్గ మృతి చెందారు. ఆమె బధిరురాలు కావడంతో వివాహం చేయకుండా తల్లిదండ్రులే పోషిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details