తెలంగాణ

telangana

ETV Bharat / crime

MURDER: భూతగాదాలో తల్లీకూతుళ్ల దారుణ హత్య - మడద గ్రామంలో దారుణం

సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. వ్యవసాయ బావి నీళ్ల కోసం జరిగిన తగాదాలో తల్లీకూతుళ్లను పెద్దనాన్న కుమారుడే అత్యంత పాశవికంగా హతమార్చాడు. పొలానికి వెళ్లిన ఇద్దరిని గొడ్డలితో నరికి చంపాడు. హుస్నాబాద్​ శివారులోని మడద గ్రామానికి వెళ్లే రహదారిలోని పొలం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

Mother and daughter murdered in madadha village
తల్లీకూతుళ్ల దారుణ హత్య

By

Published : Jun 16, 2021, 10:24 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. భూతగాదా, పొలంలో వ్యవసాయబావి నీళ్ల కోసం తలెత్తిన గొడవలో నిండు ప్రాణాలు బలయ్యాయి. మడద గ్రామానికి చెందిన గుగ్గిల్లపు సారవ్వ(60), ఉసికే నిర్మల(30) అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారు. హుస్నాబాద్​ శివారులోని మడద గ్రామానికి వెళ్లే రహదారిలోని పొలం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లీ కూతుళ్ళ దారుణ హత్యతో మడద గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇద్దరు మహిళలను మెడపై గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసులు గుర్తించారు. భూ తగాదాలు, వ్యవసాయ భూమిలో ఉన్న బావి నీళ్ల విషయంలో గొడవలు జరిగి సొంత పిన్ని, చెల్లిని పెద్దనాన్న కుమారుడు గుగ్గిళ్ల శ్రీనివాస్ హత్య చేసినట్లు మృతురాలు నిర్మల భర్త ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏఎస్పీ మహేందర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రాథమికంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: Murder: కూలీ పని అంటూ... హత్య చేసిన వ్యక్తి అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details