తెలంగాణ

telangana

ETV Bharat / crime

drown in pond: పండగపూట విషాదం.. చెరువులో పడి తల్లీకూతురు మృతి

సిద్దిపేట జిల్లాలో విషాదం..  చెరువులో తల్లీకూతురు గల్లంతు
సిద్దిపేట జిల్లాలో విషాదం.. చెరువులో తల్లీకూతురు గల్లంతు

By

Published : Oct 14, 2021, 2:45 PM IST

Updated : Oct 14, 2021, 4:29 PM IST

14:42 October 14

సిద్దిపేట జిల్లాలో విషాదం.. చెరువులో పడి తల్లీకూతురు మృతి

చెరువులో పడి తల్లీకూతురు మృతి

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామంలో బతుకమ్మ పండగపూట విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లీకూతురు మృతిచెందారు. బట్టలు ఉతకడానికి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి రోజా(28) అనే మహిళ చెరువుకు వెళ్లింది. ప్రమాదవశాత్తు చిన్న కూతురు చైత్ర(5) చెరువులో జారి పడగా..  ఆ పాపను కాపాడబోయి తల్లి కూడా చెరువులో పడిపోయింది. ఈత రాకపోవడంతో ఇద్దరు చెరువులో మునిగి చనిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించి మృతదేహాలను వెలికితీశారు.  

వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన చెప్యాల రోజా పండుగ నిమిత్తం పుట్టిళ్లు ఎనగుర్తికి  వచ్చింది. ఈ క్రమంలో గురువారం బట్టలు ఉతకడానికి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి చెరువు వద్దకు వచ్చింది. గట్టుపై ఇద్దరు కూతుళ్లు ఆడుకుంటుండగా.. చిన్న కూతురు చైత్ర కాలుజారి చెరువులో పడిపోయింది. పాపను రక్షించబోయి తల్లి కూడా ప్రాణాల కోల్పోయింది. మృతురాలు రోజా భర్త కూడా ఏడాదిన్నర క్రితం చనిపోగా.. ఆమె కూతుళ్లతో కలిసి జీవనం సాగిస్తోంది. తల్లి, చెల్లి మరణంతో చిన్నారి రష్మిక చూపులు పలువురిని కంటతడి పెట్టించాయి.  

ఇదీ చదవండి: Gang Rape at Rajendranagar : ఆటోలో తీసుకెళ్లి మహిళపై సామూహిక అత్యాచారం.. ఆ తర్వాత?

Last Updated : Oct 14, 2021, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details