గుడిలో నిద్ర చేసేందుకు వెళ్తుండగా ఆటో బోల్తా.. తల్లీకూతురు మృతి.. - auto accident at kashipeta
09:02 March 26
గుడిలో నిద్ర చేసేందుకు వెళ్తుండగా ఆటో బోల్తా.. తల్లీకూతురు మృతి..
Road Accident: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కాశిపేట వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. ఆటో బోల్తా పడిన ఘటనలో తల్లి, కుమార్తె మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రావులపల్లి ఎక్స్ రోడ్ తండాకు చెందిన గుగులోతు మంగమ్మ తండ్రి ఇటీవలే మరణించాడు. అర్వపల్లి గుడిలో నిద్ర చేపించేందుకు మంగమ్మ వెళుతోంది శుక్రవారం(మార్చి 26న) రాత్రి సుమారు 9 గంటలకు మంగమ్మతో పాటు ఆమె కుమార్తెలు, మరిదితో కలిపి మొత్తం ఐదుగురు ఆటోలో బయలుదేరారు. కొంత దూరం వెళ్లిన తర్వాత.. ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో మంగమ్మతో పాటు ఓ కుమార్తె(శారద) అక్కడికక్కడే మరణించింది. ఆటోలో ఉన్న మిగతా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మూడో కూతురైన నీలమ్మకు నడుము విరిగినట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానికులు వెంటనే సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:Gang Rape in Hyderabad: ఆటోలో ఎక్కించుకుని.. ఆపై ముగ్గురితో కలిసి దారుణం