Mother and daughter Died: నల్గొండ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని పద్మానగర్ కాలనీలోని ఓ ఇంట్లో గోడకూలి తల్లీకూతుళ్లు దుర్మరణం చెందారు. తెల్లవారుజామున నిద్రలో ఉండగా.. ప్రమాదవశాత్తు ఒక్కసారిగా గోడకూలింది. గోడ బలంగా కూలటంతో.. ఆ దాటికి ఇంట్లో ఉన్న బీరువా కింద పడింది. కాగా.. అదే ప్రాంతంలో నిద్రిస్తున్న తల్లి నడికుడి లక్ష్మి(42), కుమార్తె కల్యాణి(21) ఉండటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
నిద్రలోనే మృత్యు ఒడికి.. ఇంట్లో గోడకూలి తల్లి, కుమార్తె మృతి - Mother and daughter died in padmanagar colony
07:51 July 08
ఇంట్లో గోడ కూలి తల్లి, కుమార్తె మృతి
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. అనంతరం మృతదేహాలను మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తల్లీకూతుళ్లు ఏపీలోని శ్రీకాకుళం నుంచి నల్గొండకు వలస వచ్చి రైల్వే కూలీలకు వంట చేస్తూ జీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలే కల్యాణికి వివాహం జరిగినట్లు తెలిసిందన్నారు.
ఇవీ చూడండి..
"దృశ్యం" సినిమా రిపీట్.. వారం రోజులకే బండారం బయటపడిందిలా..
తల్లితో గొడవ.. గ్యాస్ లీక్ చేసుకుని.. ఆపై చేయి కోసుకుని..!