Suicide: తల్లీకూతురు ఇద్దరూ కలిసి అపార్ట్మెంట్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గొల్లపూడిలో జరిగింది. ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులు స్థానికంగా ఉండే తల్లీకూతురుగా గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడిన వారు తమ అపార్ట్మెంట్ వారు కాదని తెలిపారు. స్థానికంగా ఉండే వారని వెల్లడించారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. తల్లీకూతురు ఇద్దరు ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడంతో ప్రాంతంలో కలకలం రేగింది.
తల్లీకూతురు ఆత్మహత్య.. ఇంతకీ ఏం జరిగింది? - ap latest news
Mother and daughter suicide: వారికి ఎటువంటి ఆపద వచ్చిందో తెలియదు.. ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే అవి ఎవరికి తెలుసు. ఆ ఆత్మహత్య చేసుకున్నది తల్లీకూతురే. తల్లీకూతురా అయ్యో పాపం.. ఎందుకు అలా చేశారు. వారు ఇద్దరు కలిసి బలన్మరణానికి పాల్పడడానికి గల కారణాలు ఏమై ఉంటాయి. అసలు ఎక్కడ జరిగింది ఈ ఘటన అసలు చూద్దామా..
ఆత్మహత్య